Youth Drown | చిలిపిచెడ్, జూన్ 7: ఓ యువకుడు బర్రెలు కడగడానికి వెళ్లి, ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నర్సింలు కథనం ప్రకారం.. బండ పోతుగల్ గ్రామానికి చెందిన దార శేఖర్ (24) ఫైజాబాద్‌లో టేకుల నర్సింహారెడ్డి వద్ద బర్రెలు మేపడం కోసం జీతానికి పనిచేస్తున్నాడు.
శుక్రవారం శేఖర్ బర్లను మేపడానికి ఫైజాబాద్ శివారులోని వడ్లకుంటవైపు వెళ్లగా.. బర్రెలు ఇంటికి తిరిగి వచ్చాయి. కానీ శేఖర్ మాత్రం తిరిగి రాకపోవడంతో నర్సింహారెడ్డి, రవి అక్కడికి వెళ్లి చూడగా కుంట ఓడ్డుపై బట్టలు, చెప్పులు,సెల్ ఫోన్ కనిపించాయి. శేఖర్ బర్రెలు కడగడానికి కుంటలోకి దిగి, ఈత రాక ప్రమాదవశాత్తు కుంటలో పడి శేఖర్ శవమై నీటిపై తేలాడు. గ్రామస్తులు శవాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి దార హన్మంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నర్సింలు తెలిపారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు