Yoga | రామాయంపేట, జూన్ 03 : యోగా మానవ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుందని రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, యోగా శిక్షకులు మద్దెల భరత్, వాకర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం, మెదక్ చౌరస్తా వద్ద యోగా ర్యాలీని సీఐ వెంకటరాజగౌడ్ జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాకర్స్ అసోషియేషన్, ఆయూష్ శాఖ యోగా అధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
సీఐ వెంకటరాజ గౌడ్ మాట్లాడుతూ.. యోగాతో ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటారన్నారు. యోగాతో అన్ని రకాల రోగాలు మటుమాయం అవుతాయన్నారు. ప్రస్తుత తరుణంలో సమాజంలో ప్రతీ ఒక్కరికి బీపీ, షుగర్లు ఉంటాయని వాటిని నివారించాలంటే యోగా అవసరమన్నారు. రోజులో రెండు గంటలపాటు సమయం తీసుకుని కొన్ని ఆసనాలు చేస్తే మన ఆత్మ పవిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా ప్రాణాయామం, ధ్యానం కచ్చితంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సుంకోజు దామోదర్చారి తదితరులున్నారు.
Crocodile | గద్వాలలో అర్ధరాత్రి కలకలం.. ఇండ్ల మధ్యకు వచ్చిన మొసలి
Electric Vehicles | రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల జోరు.. రెండు లక్షలు దాటిన ఈవీలు
Mongolia | విశ్వాసం కోల్పోయి.. మంగోలియా ప్రధాని రాజీనామా