wild animals | నిజాంపేట, ఆగస్టు 24 : రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలను అడవిలోకి వచ్చిన జంతువులు ధ్వంసం చేస్తున్నాయి. సాగు చేసిన పంట ఫలాలు నోటి దాకా రాకముందే నాశనం చేస్తున్నాయి. నిజాంపేట మండల పరిధిలో అడవి జంతువులు వీరంగం సృష్టించాయి. పంటల పొలాల్లో జంతువులు హల్ చల్ చేస్తుండటంతో రైతులు లబోదిబోమని ఏం చేయాలో తోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.
నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన పెద్దబోయిన స్వామి తనకున్న రెండు ఎకరాలలో ఒక ఎకరం మేర మొక్కజొన్న సాగు చేశాడు. అడవి జంతువులైన అడవి పందులు, దుప్పులు, ఇతర జంతువులు ప్రస్తుతం కంకుల దశలో మొక్కజొన్న పంటలోకి ప్రవేశించి వాటిని ధ్వంసం చేస్తూ కంకులను తినేస్తున్నాయి.
అడవి జంతువుల బారి నుండి పంటను కాపాడుకోవడానికి రాత్రి పూట కాపలా పోయిన కూడా ఫలితం లేదని పెద్దబోయిన స్వామి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని రైతు ఆందోళన చెందుతున్నాడు. తమను ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు.
Read Also :
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?