Scientists | చిలిపిచెడ్, అక్టోబర్ 28 : చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్, చండూర్ గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం (ఏరువాక కేంద్రం) శాస్త్రవేత్తలు డా. ఏ నిర్మల, డా.కే అరుణ వ్యవసాయ పంట పొలాలను పరిశీలించారు.
మంగళవారం మండలంలో పర్యటించిన శాస్త్రవేత్తలు ముఖ్యంగా వరి పంటలో ప్రస్తుతం చిరు సంచుల ప్రయోగ దశలో ఉన్న వరంగల్ పరిశోధన స్థానం నుండి WGL-1380 అనే మిక్కిలి మధ్యస్థ గింజ, మధ్యస్థ వరి రకం పరిశీలించారు. ఈ రకం మధ్యస్థంగా 135 రోజుల కాలంలో కోతకు వస్తుంది. ఈ రకం వానాకాలానికి అనువైన రకం అని తెలిపారు.
KPS-10642 అనే రకం కూడా సన్న గింజ రకం.. ఈ రకం 125 రోజుల్లో కోతకు వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. RNRH-235 అనే రకం పంటనీ పరిశీలించిన అనంతరం టమాటా పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు గోపాలరావు, చంద్రశేఖర్ రెడ్డి, బాలరాజు, విక్రం రెడ్డి,యంగ్ ప్రొఫెషనల్ YP 1 – కే ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Cyclone Montha | మొంథా ఎఫెక్ట్.. చెన్నైలో భారీ వర్షం.. నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
Shaligouraram | తేమ పేరుతో పత్తి కొనుగోలు చేయడంలే.. శాలిగౌరారంలో రోడ్డుపై బైఠాయించిన రైతులు
Cyclone Montha | దూసుకొస్తున్న ‘మొంథా’.. అల్లకల్లోలంగా ఒడిశా తీరం.. Video