Cyclone Montha : పశ్చిమ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను (Montha Cyclone) తీరంవైపు దూసుకొస్తోంది. దాంతో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), ఒడిశా (Odisha) రాష్ట్రాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
ఒడిశాలోని గంజామ్ జిల్లా తీర ప్రాంతాల్లో మొంథా ప్రభావం మరింత తీవ్రంగా ఉన్నది. తుఫాను తీరానికి చేరకముందే బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల వర్షం కురుస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడుతున్నాయి. గంజామ్ జిల్లాలోని ఆర్యపల్లి తీరంలో సముంద్రం అల్లకల్లోలంగా ఉన్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
#WATCH | Odisha: Rough sea, strong winds and rainfall in Ganjam district this morning, due to the impact of cyclone #Montha
Visuals from Aryapalli of Ganjam District. pic.twitter.com/SNRExjlOyi
— ANI (@ANI) October 28, 2025