నల్లగొండ: తేమను సాకుగా చూపి పత్తి కొనుగోలు చేయడం (Cotton) లేదని రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం (Shaligouraram) మండలం మాదారంకలాన్ వద్ద రైతుల రోడ్డుపై బైఠాయించారు. ద్విచక్రవాహనాలు అడ్డుపెట్టి రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్నారు. పత్తికి నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. సీసీఐ కేంద్రాల్లో (CCI Centers) పత్తి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ ఎక్కువగా ఉందంటూ పత్తి కొనుగోలు చేయకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పత్తి కొనుగోలు చేసే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించారు. దీంతో నకిరేకల్-అర్వపల్లి మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి.