BJP | చిలిపిచెడ్, అక్టోబర్ 5 : చిలిపిచెడ్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో జెడ్పీటీసీ, ఎంపీపీలుగా బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు అజ్జమరి నాగేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీజేపీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గుండం శంకర్ హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. రానున్న జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో మండలంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా ముందుకు పోవాలని మండల బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు, ఎన్నో హామీలు ఇచ్చిందని ఇప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని.. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తెలియజేయాలని తెలిపారు.
బీజేపీ ఎంపీపీ, జెడ్పిటీసీ అభ్యర్థులను గెలిపిస్తే మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి కృషితో మండలంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీవో కార్యాలయం, హాస్పిటల్‌ను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మండల నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Man Shoots Friend | ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్యక్తి.. రికార్డ్ చేసిన వీడియో వైరల్
YS Jagan | ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు