పోలీస్ స్పోర్ట్స్ మీట్లో మెడల్స్ సాధించిన సిబ్బందికి ఎస్పీ అభినందనలు
నాల్గొవ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ - 2026 పోటీలు ఈ నెల 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. ఈ క్రీడా పోటీల్లో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది
నీలగిరి, ఫిబ్రవరి 24 : నాల్గొవ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026 పోటీలు ఈ నెల 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. ఈ క్రీడా పోటీల్లో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖకు చెందిన సిబ్బంది పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి పలు విభాగాల్లో మెడల్స్ సాధించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెడల్స్ సాధించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విధులతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపుతూ శాఖకు మంచి పేరు తీసుకువచ్చినందుకు సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్‌లో జాతీయ స్థాయి పోటీల్లో కూడా మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. యాదాద్రి జోన్-V పరిధిలోని వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొని పలు మెడల్స్ సాధించడం విశేషం. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్.డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాము, ఆదిరెడ్డి, నాగరాజు, ఆర్.ఐలు శ్రీనివాస్, సంతోష్, సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

