HCU Land Issue | జహీరాబాద్, ఏప్రిల్ 1 : రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని యునివర్సిటీలకు చెందిన భూముల జోలికి వొస్తే ఊరుకునేది లేదని భారత రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ రాకేష్ హెచ్చరించారు. ఇవాళ స్థానిక బీఆర్ఎస్వీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాకేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వందల ఎకరాల అటవీ ప్రాంత భూముల్లోని చెట్లను నరికి వేయడానికి బుల్డోజర్లు తెచ్చి విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కారు అట్టి యూనివర్సిటీ భూములను బుల్డోజర్ల సహకారంతో క్లీన్ చేసి భూదందాకు తెరలేపింది అని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమా లేక బుల్డోజర్ల ప్రభుత్వమా..? అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తన తమ్ముళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమ తమ్ముళ్లకు యూనివర్సిటీకి చెందిన ప్రభుత్వ భూములను కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు.
విద్యార్థులు చూస్తూ ఊరుకోరు..
ప్రభుత్వ భూములను అమ్మాలని చూస్తే విద్యార్థులు చూస్తూ ఊరుకోబోరని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విద్యార్థి లోకంతో పెట్టుకున్న ఏ ప్రభుత్వము కూడా మనుగడ సాధించిన దాఖలాలు లేవన్నారు. విద్యార్థులు, ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధ ఖాండ సృష్టించి భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
పోలీసులు అక్రమ కేసులు పెట్టి విద్యార్థులను సమస్యలపై చేసే పోరాటాలను ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ వర్సిటీలకు చెందిన ఒక్క గజం భూమిని కూడా విడిచి పెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇకనైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి పనికి మాలిన చర్యలు మానుకుని సెంట్రల్ యూనివర్సిటి భూముల జోలికి రాకూడదని.. ఒకవేళ ఇదే దుశ్చర్యకు పాల్పడితే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్వీ నాయకులు ఓంకార్, పరశురాం, ఫయాజ్, మారుతి యాదవ్, రఘు తేజ, అవెస్ , అజీమ్ , ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి