Illegal Registrations | రామాయంపేట, జూలై 07 : రామాయంపేట పట్టణంలోని ఓ బడా నాయకుడు తమ పేరిట ఖాళీగా ఉన్న ప్లాట్లను అక్రమంగా రిజిస్రేష్టన్కు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తున్నాడని అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో పెద్ద ఎత్తున ఆందోళన ర్యాలీ, నిరససన కార్యక్రమాన్ని చేపట్టారు.
సోమవారం రామాయంపేట పట్టణానికి చెందిన ముదిరాజ్ సంఘం పెద్దమ్మ దేవాలయం, యాదవ సంఘం, బీడీ కార్మికుల ఇళ్ల స్థలాలను గత కొన్ని సంవత్సరాలుగా దొంగ రిజిస్ట్రేషన్లను చేసుకుంటూ కాలం గడుపుతున్నాడని అతనిపై ప్రభుత్వం తగిన చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. వందలాదిగా బాధితులు పట్టణంలో ర్యాలీ తీసి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
రామాయంపేటకు చెందిన శీలం సుభాష్‌రెడ్డి అనే వ్యక్తి ఈ తతంగానికి పాల్పడుతూ అందిన కాడికి దోచుకునేలా ఖాళీగా ఉన్న స్థలాలను అక్రమించుకోవడమే గాకుండా దొంగ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్లను చేసుకోవడం జరుగుతుందని ఆరోపించారు. అలాంటి వ్యక్తిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా.. కఠినంగా శిక్షిచాలని కోరారు.
పట్టణ శివారులోని సర్వే నెబర్ 1597 గల భూమిని తానే ఇతరులకు విక్రయాలు జరిపి మళ్లీ ఇతర వ్యక్తులకు విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. సుభాష్‌రెడ్డి అనే వ్యక్తిపై ప్రభుత్వం తహసీల్దార్, సంబంధిత పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు