Paddy Crop |వెల్దుర్తి, మార్చ్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి.. బోర్లలో నీరు రాక రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సాగునీరు లేక వేసిన వరి పంట ఎండిపోవడంతో తమను ఆదుకునేవారు కరువయ్యారని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. మాసాయిపేట మండలంలో మరోసారి ఇలాంటి దృశ్యమే కంట పడింది.
మాసాయిపేట మండలం బొమ్మారం గ్రామానికి చెందిన రైతు భిక్షపతి ఎకరంన్నర పొలంలో వరి పంటను సాగు చేశాడు. సాగు పనులు మొదటిపెట్టే సమయానికి సాగు నీటిని అందించిన బోరుబావిలో ఎండలు తీవ్రతరం కావడంతో నీటి ఊటలు తగ్గిపోయాయి. దీంతో పొలానికి నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చేసేదేమి లేక రైతు భిక్షపతి ఎకరంన్నర వరి పొలం వదిలేశాడు. దీంతో వరి పంట నెర్రలు బారి ఎండిపోతుంది.
అప్పులు చేసిన పెట్టిన లాగోడి ఖర్చులు వృధా అయ్యాయని, కళ్లముందే పంట ఎండిపోతుండడంతో రైతు భిక్షపతి ఆవేదన చెందుతున్నాడు.