Illegal Affair | నర్సాపూర్, నవంబర్ 18 : వివాహేతర సంబంధం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఓ వ్యక్తిని కడతేర్చిన సంఘటన నర్సాపూర్‌లో సంచలనం సృష్టించింది. ఎస్ఐ రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఉత్రాల తాలుకా గోండా జిల్లా గోవర్ధన్ గ్రామానికి చెందిన షారూఖ్ అన్సారీ(24) నర్సాపూర్ పట్టణంలో కార్ వాషింగ్ సెంటర్లో లేబర్ పని చేస్తూ జీవిస్తున్నాడు.
ఆరు సంవత్సరాల క్రితం షారూఖ్ అన్సారీ సంగారెడ్డి జిల్లాగుమ్మడిదల మండలంలోని దోమడుగు గ్రామానికి ప్లంబర్ పని చేసేందుకు వెళ్లాడు. పని చేస్తున్న ఇంటి పక్కనే ఉన్న ఎండీ సల్మాబేగంతో షారూఖ్ అన్సారీకి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారడంతో ఇరువురు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గతంలో ఎండీ.సల్మాబేగం చిన్నతనంలో నర్సాపూర్‌లోని తన అమ్మమ్మ దగ్గర చదువుకునేటప్పుడు నర్సాపూర్ పట్టణానికి చెందిన అష్టా బేగం అనే మహిళతో స్నేహం ఏర్పడింది.
అష్టా బేగం భర్త మహమ్మద్ షబ్బర్ జైలుకు వెళ్లడంతో..
అప్పడి నుండి షారూఖ్ అన్సారీ భార్య ఎండీ. సల్మాబేగం, అష్టా బేగం ఇరువురు సాన్నిహిత్యంగా ఉండేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత సల్మాబేగం స్నేహితురాలికి జహీరాబాద్ పట్టణానికి చెందిన మహమ్మద్ షబ్బర్(24) అనే వ్యక్తితో వివాహం జరిగింది. గత సంవత్సరం క్రితం అష్టా బేగం భర్త మహమ్మద్ షబ్బర్ కేసు విషయంలో జైలుకు వెళ్లాడు. అప్పటి నుండి అష్టా బేగం నర్సాపూర్ పట్టణంలోనే నివాసం ఉంటుంది. ఆ సమయంలో సల్మాబేగం భర్త షారూఖ్ అన్సారీతో అష్టా బేగం సన్నిహితంగా ఉండేది. సల్మాబేగం మూడవ డెలివరీ గురించి నర్సాపూర్ నుండి తల్లిగారి గ్రామమైన దోమడుగుకు వెళ్లింది. అప్పటి నుండి తన భర్త, స్నేహితురాలు ఇరువురు కూడా సన్నిహితంగా ఉంటున్నారని సల్మాబేగంకు తెలిసింది.
గత నాలుగు నెలల క్రితం మూడవ సంతానంగా ఒక మగ బిడ్డ పుట్టగా పిల్లలను తీసుకొని నర్సాపూర్ పట్టణానికి వచ్చి తన అమ్మమ్మ సాబేర బేగంతో కలిసి ఉంటుంది. తన భర్త షారూఖ్ అన్సారీ మాత్రం తన స్నేహితురాలు అష్టా బేగంతోనే కలిసి ఉంటున్నాడు. ఈ విషయంపై ఇరువురి కుటుంబాల మధ్య గొడవ కూడా జరిగింది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సమయంలో తన స్నేహితురాలు అష్టా బేగం, ఆమె భర్త షబ్బర్ ఇతర కుటుంబ సభ్యులు కలిసి నర్సాపూర్‌లోని సల్మాబేగం ఇంటికి వచ్చి ఒకరి జోలికి ఒకరు పోవద్దని అందరు మాట్లాడుకొని రాత్రి 9 గంటల సమయంలో వారు వెళ్లిపోయారు.
రాయారావు చెరువు కట్ట వద్దకు రమ్మని పిలిచి..
ఈ పంచాయతీకి తన భర్త షారూఖ్ అన్సారీ మాత్రం రాలేదు. ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో సల్మాబేగం కుటుంబ సభ్యులు అలాగే అష్టాబేగం, భర్త షబ్బర్ కుటుంబ సభ్యులు నర్సాపూర్‌లోని రాయారావు చెరువు వద్దకు వెళ్లి షారూఖ్ అన్సారీని పిలిచి మాట్లాడాలని అనుకున్నారు. అదే సమయంలో అష్టా బేగంను షబ్బర్ కుటుంబసభ్యులు చంపుతామని బెదిరించి షబ్బర్ కత్తి చూపెట్టగా అష్టాబేగం వెంటనే సల్మాబేగం భర్త షారూఖ్ అన్సారీకి ఫోన్ చేసి రాయారావు చెరువు కట్ట వద్దకు రమ్మని పిలిచింది.
షారూఖ్ అన్సారీ అక్కడకు రాగాగే షబ్బర్ కుటుంబ సభ్యులు అతనిని గట్టిగా పట్టుకోగా షబ్బర్ తన వద్ద గల కత్తితో విచక్షణారహితంగా కడుపులా పొడిచి గొంతు కోయడం జరిగింది. కత్తి దాడిలో గాయపడ్డ షారూఖ్ అన్సారీ కొట్టుకుంటూ కట్ట పక్కనే గల పొదలలో పడి చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సల్మాబేగం అక్కడికి వెళ్లి చూడడా.. షారూఖ్ అన్సారీ మృతి చెంది ఉన్నాడు. తన భర్తను ఉద్దేశంతోనే పిలిపించి కత్తితో పొడిచి చంపిన షబ్బర్ అతనికి సహకరించిన తల్లిదండ్రులు షబ్బీర్, రేష్మబేగం, స్నేహితుడు అంబదాస్, బావమరిది పాషాలపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఎండీ సల్మాబేగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై రంజిత్ కుమార్ వెల్లడించారు.
Ambulance Catches Fire | మంటల్లో అంబులెన్స్.. నవజాత శిశువు, వైద్యుడు సహా నలుగురు సజీవదహనం
KTR | 21న జాతీయ రహదారుల దిగ్బంధం.. భారీగా తరలిరావాలని అన్నదాతలకు కేటీఆర్ పిలుపు
Narayana Murthy | చైనా ఫార్ములాలో.. యువత 72 గంటలు పనిచేయాలి : ఇన్ఫీ నారాయణమూర్తి