ATM | మెదక్ అర్బన్, మార్చి 25 : ఏటీఎంలో డబ్బులు తీసివ్వమని సాయం కోరితే ఇద్దరు వ్యక్తులు డెబిట్ కార్డు మార్చేసి నగదు కాజేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి స్థానిక యూనియర్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చాడు. అయితే అతనికి డబ్బు విత్ డ్రా కాకపోవడంతో.. అక్కడే ఉన్న ఇద్దరు దుండగులు సాయం చేస్తామంటూ తాము తీసిస్తామని సదరు వ్యక్తిని నమ్మించి ఏటీఎంలో కార్డు పెట్టారు. పిన్ నంబర్ అడిగి ఎంటర్ చేశారు.
ఆ తర్వాత దుండగులుఈ మిషన్‌లో క్యాష్ రావడంలేదని చెప్పి కార్డు మార్చి దానిని పోలిన ఇంకో కార్డు అతనికి ఇచ్చి వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటి తర్వాత రూ.25 వేలు డెబిట్ అయినట్లు కార్డుదారుడికి మెసేజ్ వచ్చింది. దీంతో ఇంతకు ముందు ఆ ఇద్దరు దుండగులు తన కార్డు మార్చి వేరేచోట క్యాష్ డ్రా చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సీసీ టీవి పుటేజీని పరిశీలించి దుండగుల ఫోటోలను రిలీజ్ చేశారు. వారి అచూకీ తెలిస్తే 8712657913 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. నిందితులను పట్టించిన వారికి రివార్డ్ అందజేస్తామని పేర్కొన్నారు.
Read Also |
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?