Thieves | నర్సాపూర్, సెప్టెంబర్ 18 : ఒకే రాత్రి దొంగలు హల్ చల్ సృష్టి్ంచారు. దొంగలు రాత్రి ఒకేసారి రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడిన ఘటన నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ రెండు దుకాణాలు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం.
ఎస్ఐ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన సంతం రవిశంకర్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని మార్కెట్ రోడ్డులో గత నాలుగు సంవత్సరాలుగా కిరాణ దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం దుకాణం తీయడానికి రాగానే తాళం పగలగొట్టి ఉండడంతో షాక్కు గురయ్యాడు. దుకాణం తలుపు తెరిచి చూడగా గల్లపెట్టెలో గల రూ.2 వేల నగదు కనిపించకుండా పోయాయి. దొంగలను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు రవిశంకర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
జ్యూవెలరీ వర్క్ షాప్లో దొంగతనం..
నర్సాపూర్ పట్టణానికి చెందిన అవుసుల కృష్ణచారి గత మూడు సంవత్సరాలుగా మార్వాడీ రోడ్డు నందు జ్యువెలరీ వర్క్ షాప్ పెట్టుకొని ఉపాధి పొందుతున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం నాడు రాత్రి దుకాణం మూసేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు షాప్ తెరిచి చూసేసరికి దుకాణంలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అనుమానం వచ్చి గల్లపెట్టె చూసే సరికి అందులో గల 20 తులాల వెండి బిల్లలు, కొంత నగదు కనిపించలేదు.
దుకాణం వెనుక గోడకు గల వెంటిలేటర్ జాలి తీసి దొంగలు చొరబడి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. అలాగే ఈ దుకాణం పక్కనే గల అంజయ్య అనే వ్యక్తి దుకాణంలో దొంగతనానికి ప్రయత్నించడం జరిగింది. అట్టి గుర్తుతెలియని దొంగలను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం వెల్లడించారు.
Drugs | మాసాయిపేటలో 4 కిలోల డ్రగ్స్ పట్టివేత..
Promotions | రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
Traffic Jam | హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్