Drugs: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో పెద్దమొత్తంలో డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. గురువారం ఉదయం మాసాయిపేట మండలం రామంతపూర్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ వాహనంలో 4 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సావెల్ పాండే, నీలేశ్ పాండేను అరెస్టు చేశారు. కేసు నమోదుచేఇసి దర్యాప్తు చేస్తున్నారు.