Pothole | నర్సాపూర్, నవంబర్ 5 : అది నిత్యం పలు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు భారీ గుంత ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతుంది. ఈ విషయాన్ని టీమ్ భజరంగ్ సేన యువకులు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన యువకులు వారు స్వయంగా ఆ గుంతను పూడ్చేశారు.
వివరాళ్లోకి వెళితే.. నర్సాపూర్ నుండి వెల్దుర్తి వెళ్లే మార్గంలో బ్రాహ్మణపల్లి-గొల్లపల్లి గ్రామాల మధ్య గత కొన్ని నెలల నుండి భారీ గుంత ఏర్పడి ప్రమాదాన్ని తలపిస్తున్నది. అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా గుంతను పూడ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు. నర్సాపూర్ నుండి వెల్దుర్తి వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై ఏర్పడ్డ భారీ గుంతను గొల్లపల్లి గ్రామానికి చెందిన టీమ్ భజరంగ్ సేన యువకులు బుధవారం పూడ్చివేశారు.
ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం ఇదే రోడ్డుపై గొల్లపల్లి గ్రామ సమీపంలో గుంతను పూడ్చివేశామన్నారు. మిగతా చోట్ల కూడా భారీ గుంతలు ఉన్నప్పటికి సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అధికారులు గుంతలను పూడ్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని.. దీంతో మేమే ముందుకు వచ్చి గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు.

NIT | వరంగల్ నిట్లో ఉచిత ‘గేట్’ కోచింగ్
Hanumakonda | డైట్లో అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
ISRO: జనవరిలో గగన్యాన్ పరీక్ష.. 2035 నాటికి స్పేస్ ల్యాబ్