MEO | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 27 : పదో తరగతి పరీక్షలకు ఎలాంటి విధులు కేటాయించనప్పటికీ ఈ నెల 26న పదో తరగతి గణిత పరీక్ష జరుగుతున్న సమయంలో చిన్న శంకరంపేట మండల విద్యాధికారిణి పుష్పవేణి అనధికారంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, మిర్జాపల్లిలోని పరీక్షా కేంద్రాలలోకి వెళ్లి విద్యార్థులను, ఇన్విజిలేటర్లను భయబ్రాంతులకు గురి చేశారంటూ ఎస్టీయూ, తపస్ ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్షులు రాజగోపాల్గౌడ్, ఎల్లం ఇవాళ జిల్లా విద్యాధికారి రాధాకిషన్కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అనధికారంగా పరీక్షా కేంద్రాలలోకి వెళ్లి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెంట్లు, డిపార్టుమెంట్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. అంతేగాకుండా విద్యార్థుల విలువైన పరీక్ష సమయాన్ని వృధా చేశారని, వెంటనే ఎంఈవోపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డీఈవోను కోరినట్లు వారు పేర్కొన్నారు. వారి వెంట ఉపాధ్యాయ సంఘాల నేతలు లక్ష్మణ్ తదిరులు ఉన్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!