చిన్నశంకరంపేట,మే15 : ధాన్యం తూకంలో అవకతవకలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ మన్నన్ హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని ఎస్.కొండాపూర్, గవ్వలపల్లి తదితర గ్రామాల్లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
ఇవి కూడా చదవండి..
Jaish terrorists | జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చివరి క్షణాలు.. డ్రోన్ ఫుటేజీ విడుదల
Anasuya| పెళ్లి కాకుంటే ఆ హీరోతో డేటింగ్..అనసూయ ఇంత ఓపెన్‌గా చెప్పేసింది ఏంటి?