Jaish terrorists | న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఇవాళ ఉదయం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. థ్రాల్ ప్రాంతంలోని నదిర్ గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు (Jaish-e terrorists) చెందిన ముగ్గురు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు. అయితే జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తలదాచుకున్న చివరి క్షణాలను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. డ్రోన్ ఫుటేజీను విడుదల చేసింది. ఉగ్రవాదులను డ్రోన్ సహాయంతో గుర్తించి, అక్కడ కూంబింగ్ నిర్వహించి మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్లో జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఆసిఫ్ అహ్మద్ షేక్, అమిర్ నజీర్ వనీ, యవర్ అహ్మద్ భట్ హతయ్యారు.
ఇదిలా ఉండగా.. షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన 48 గంటల్లోనే థ్రాల్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. మంగళవారం షోపియన్ జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబా టాప్ కమాండర్ షాహిద్ కుట్టే, అద్నాన్ షఫీ, సహా ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మూడో ఉగ్రవాదిని పుల్వామాకు చెందిన అహ్సాన్ ఉల్ షేక్‌గా గుర్తించారు. ఇక ఉగ్రవాదుల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో ఏకే 47 రైఫిల్స్, మ్యాగజైన్స్, గ్రెనేడ్స్ ఉన్నాయి.
ఉగ్రవాదుల చివరి క్షణాలు.. డ్రోన్ ఫుటేజ్
జమ్మూకశ్మీర్ – ట్రాల్లో ఒక షెడ్లో దాక్కున్న ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు
ఉగ్రవాదులను డ్రోన్‌తో గుర్తించి చంపేసిన భద్రతా దళాలు https://t.co/KZFUZP0wez pic.twitter.com/ZiGGz077B8
— Telugu Scribe (@TeluguScribe) May 15, 2025