Anasuya| అందాల ముద్దుగుమ్మ అనసూయ న్యూస్ రీడర్‌గా కెరియర్ మొదలు పెట్టి, ఆ తర్వాత యాంకర్ గా మారింది. జబర్ధస్త్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న తర్వాత సినిమాలలోకి అడుగుపెట్టింది. 2003లో మొదటి సారి తెరపై కనిపించిన అనసూయ దాదాపు 13 సంవత్సరాల తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో నాగార్జునతో కలిసి నటించి తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందులో అనసూయ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక అదే సంవత్సరం అనసూయ చేసిన ‘క్షణం’ చిత్రం కూడా మంచి ఆదరణ పొందింది. ఇక నటిగా అనసూయ స్థాయిని పెంచిన చిత్రం రంగస్థలం కాగా, ఇందులో రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్లో మైల్ స్టోన్‌గా నిలిచింది.
ప్రస్తుతం టీవీ షోలతోపాటు కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు అనసూయ భరద్వాజ్.అయితే అనసూయ తాజాగా ఓ బుల్లితెర కార్యక్రమంలో తన కెరీర్ గురించి మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలపై సరదాగా కామెంట్స్ చేసింది. యాంకర్ రవి, శ్రీముఖి హోస్ట్ చేసిన టీవీ షోలో టాస్క్ ప్రకారం అడిగిన ప్రశ్నలన్నింటికి నిజాయితీగా సమాధానం చెప్పాలి. లేదంటే పచ్చి మిరపకాయ తినాల్సి వస్తుంది అని యాంకర్ రవి, శ్రీముఖి తెలిపారు. దీంతో అనసూయ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసింది. ఇక రవి ప్రశ్నిస్తూ మీకు ఒకవేళ పెళ్లి కాకుంటే టాలీవుడ్ లో ఏ హీరోతో డేటింగ్ చేసేవారు అని అడగ్గా, దానికి ఏ మాత్రం ఆలోచించకుండా రామ్ చరణ్ అని సమాధానం చెప్పింది.
అలానే అడవి శేష్ గురించి కూడా కామెంట్స్ చేస్తూ.. శేష్ షూటింగ్ లొకేషన్ లో మిలిటరీ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్ గా ఉంటారు. అడవి శేషు అలా ఉండడం వల్లే క్షణం కానీ, అతని ఇతర చిత్రాలు కానీ విజయం సాధిస్తున్నాయంటూ ప్రశంసలు కురిపించింది. ఇక ఇదే షోలో తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి మాట్లాడుతూ.. ఆయనలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ క్వాలిటీ షార్ట్ టెంపర్ అని పేర్కొంది. మిగిలిన అన్ని విషయాల్లో తన భర్త మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ప్రశంసలు కురిపించింది. తన పేరు గురించి కూడా ప్రస్తావిస్తూ.. మొదట తన తల్లి తనకి పవిత్ర అనే పేరు పెట్టాలనుకుంది. అందుకే పవిత్ర అనే పేరు కూడా తనకిష్టమని అనసూయ తెలిపింది.