Bellamkonda sai srinivas | ఈ మధ్య చాలా మంది ట్రాఫిక్‌లో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వారిని భయపెడుతున్నారు. కొందరు ర్యాష్ డ్రైవింగ్‌తో వణికిస్తుంటే, మరి కొందరు రాంగ్ రూట్లో వచ్చి ఇబ్బందులకి గురి చేస్తున్నారు. రెండు రోజుల క్రితం యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైదరాబాద్‌లో హల్చల్ చేశారు. జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో రాంగ్ రూట్లో వచ్చిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన కారుని ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి తీసుకెళ్లాడు. దాంతో ఆ కానిస్టేబుల్ హీరోని అడ్డుకొని రోడ్డుపైనే నిలదీశాడు. దాంతో చేసేదేమి లేక పలాయనం చిత్తగించాడు. ఎంత సినిమా హీరో అయితే మాత్రం రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు కారు నడపొచ్చా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోసారు. మరోవైపు ఈ ఘటనపై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.తాజాగా ఈ విషయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది
బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడి శీను’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కవచం, రాక్షసుడు, జయ జానకీ నాయకా, సాక్ష్యం.. వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మనోడి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. హిందీలో తీసిన ‘ఛత్రపతి’ రీమేక్ డిజాస్టర్ కావడంతో సైలెంట్ అయిన శీను ఇప్పుడు భైరవం అనే మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో అయిన కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇందులో మంచు మనోజ్, నారా రోహిత్ లు మరో హీరోలు. ముగ్గురు కలిసి నటించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. మే 30న ఈ చిత్రం విడుదల కాబోతుంది.
ముగ్గురు హీరోలున్నా సినిమాకి పెద్దగా బజ్ లేదు. ఆడియెన్స్ కి రీచ్ కావడంలో కాస్త వెనకబడుతుంది. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంపై ముగ్గురు హీరోల కెరీర్ డిపెండ్ అయి ఉంది. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో టైసన్ నాయుడు, కిష్కిందపురి, హైందవ చిత్రాలు కూడా ఉన్నాయి. మనోడు మంచిగానే డ్యాన్సులు, ఫైట్లు చేస్తున్నా కూడా మొహంలో ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేదని, ఆ కారణంగానే బెల్లంకొండ శ్రీనివాస్ ఎదగలేకపోతున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు. రానున్న సినిమాలలో అయిన తన బలహీనతని అధిగమించి అందరి మన్ననలు పొందుతాడా అనేది చూడాలి.