Collector Rahul Raj | మెదక్ రూరల్, సెప్టెంబర్ 04 : గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం మెదక్ మండలం కొమటూరు చెరువు వద్ద కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. అధిక సంఖ్య (192)లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుండటంతో, 30 మంది గజ ఈత గాళ్లు, 30 మంది శానిటేషన్ వర్కర్స్ రెండు విడతలుగా విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా, సురక్షితంగా జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజల సౌకర్యం, రహదారి రవాణా, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
GST | సిమెంట్, ఉక్కుపై జీఎస్టీ రేట్ల తగ్గింపు.. రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహం..!
Laxmidevipally : ‘పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి’
Nur Khan Base | భారత్ దాడిలో దెబ్బతిన్న నూర్ఖాన్బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న పాక్