MLA Sunitha lakshma reddy | నర్సాపూర్, సెప్టెంబర్ 2 : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, చివరకు ప్రజల ఆశయాలను నెరవేర్చారని ఆమె గుర్తు చేశారు. ఇకపై కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆయన ధైర్యంగా ఎదుర్కొని, తెలంగాణ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ముందుకు నడిపిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు దోహదపడుతుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ఎంత మంది పార్టీకి ద్రోహం చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి ముప్పు లేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ విషయంలో ఎటువంటి ఇహ, పర భేదాలు లేవని, కవిత విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మరోసారి దీనికి నిదర్శనమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత