Narsapur robbery | నర్సాపూర్, అక్టోబర్ 11 : లిఫ్ట్ ఇస్తామని చెప్పి నగదును, అకౌంట్లో డబ్బులను కాజేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్కుమార్తో కలిసి జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 7వ తేదీ మధ్యరాత్రి నర్సాపూర్ పట్టణంలో ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి సంగారెడ్డి రోడ్డులో ఒంటరిగా స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఆపి అతనిని చేతులతో కొట్టి అతని నుండి రూ.350 నగదు, పర్సు లాక్కొన్నారు. అలాగే అదే రాత్రి గొర్రెల కాపరులైన ఇద్దరు వ్యక్తులకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి నర్సాపూర్ పట్టణంలోని మెదక్ మార్గంలో బస్టాప్ వద్ద కారులో ఎక్కించుకొని మార్గమధ్యలో కారును ఆపి వారిని చేతులతో కొట్టి.. చంపుతామని బెదిరించి వారి వద్ద నుండి రూ.2500 నగదు, ఫోన్ ఫే నుండి రూ.5,550 కాజేశారు. ఈ కేసులోని నేరస్తులను సాంకేతిక ఆధారాలను ఉపయోగించి జగద్గిరిగుట్టలోని ఆల్వీన్ కాలనీలో ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకొని తదుపరి అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ నేరాలని పాల్పడిన వారు మెదక్ జిల్లా వాసులు కాగా.. నీలగిరి దశరథ్ (21) పాపన్నపేట్ మండలం , నార్సింగి గ్రామం, బుర్నోటి ఆగమయ్య(21) రేగోడ్ మండలం లింగంపల్లి గ్రామం, దన్నారం కృష్ణ(20) టేక్మాల్ మండలం కోరంపల్లి గ్రామాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించడం జరిగింది.
నేరం ఇలా చేశారు..
పైన తెలిపిన నిందితులు ముగ్గురు ఈ నెల 7వ తేదీన ఉదయం 7 గంటలకు సుమిత్ అనే వ్యక్తి వద్ద నుంచి స్విఫ్ట్ కారును కిరాయికి తీసుకొని దశరథ్ సొంత ఊరైన నార్సింగికి వాళ్ళ నాన్నను చూడడానికి వచ్చారు. నార్సింగి నుండి రాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్కు బయలుదేరి మార్గ మధ్యలో నర్సాపూర్ దగ్గరలో గల క్లాసిక్ గార్డెన్ వద్దకు రాగానే ఒంటరిగా స్కూటీపై వెళ్తున్న మేకల కొండయ్య అనే వ్యక్తిని ఆపి అతనిని చంపుతామని బెదిరించి అతని వద్ద రూ.350, పర్సు, ఫోన్ దొంగిలించారు.
అనంతరం నర్సాపూర్ చౌరస్తా మెదక్ మార్గంలో నిలబడిన గొర్రె కాపరులైన రేణిపట్ల నరసింహా, బజారు రామప్పకి కారులో లిఫ్ట్ ఇస్తామని కారులోకి ఎక్కించుకొని కొంత దూరం వెళ్లాక వాళ్ళను చంపుతామని బెదిరించి రూ.2500 నగదు, ఫోన్ ఫే నుండి రూ.5500 కాజేశారు. నిందితుల నుండి స్విఫ్ట్ కారు, 3 మోబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సవాలుగా మారిన ఈ కేసు వెలికితీతలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి, సిబ్బంది శ్రీకాంత్ ఉపేంద్ర బాగయ్య లు సమర్థవంతంగా పనిచేసి దొంగలను చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా దొంగ సొత్తును స్వాధీనం చేయడంలో విశేష కృషి చేశారు.
Robbery | లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్నారు.. కానీ మార్గమధ్యలోనే ఆపి..
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర
Rangareddy | 250 గజాల ఇంటి స్థలం కోసం వివాదం.. బాబాయిపై కుమారుడి కత్తి దాడి