Rangareddy | రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సురంగల్‌లో ఘోరం జరిగింది. ఆస్తి వివాదం నేపథ్యంలో బాబాయి రామగళ్ల శ్యామ్(45)పై కుమారుడు ప్రసాద్ కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో శ్యామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 250 గజాల ఇంటి స్థలం విషయంలో బాబాయి, కుమారుడు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో శ్యామ్‌పై ప్రసాద్ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.