SP Paritosh Pankaj | ఝరాసంగం, అక్టోబర్ 08 : ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ గ్రామంలో గల దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో బుధవారం విశ్వశాంతి, ధర్మ పరిరక్షణ కోసం ఆశ్రమ పీఠాధిపతులు అవధూతగిరి మహారాజ్, మహా మండలేశ్వర సిద్ధేశ్వరనందగిరి మహారాజ్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మృత్యుంజయ లక్ష జపయజ్ఞంకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎస్పీ పరితోష్ పంకజ్కు ముందుగా ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో, మంగళవాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలకు అభిషేకం, దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకుని మంగళ హారతి నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్పీకి ఆశ్రమ పీఠాధిపతులు పూలమాల వేసి శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
11:30 నిమిషాలకు ప్రారంభమైన మృత్యుంజయ మహాయజ్ఞం 2:29 నిమిషాలకు పూర్ణాహుతితో ముగిసింది. భక్తులకు పొట్టి పల్లి గ్రామస్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Compensation | రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. 11 ఏళ్ల తర్వాత భర్తకు రూ.51 లక్షల పరిహారం..!
Madhira | మధిర మిర్చి మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ సిబ్బంది, ఏపీ వ్యాపారి అక్రమ దందా..?