Snake | రామాయంపేట, జూలై 14 : అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము కలకలం సృష్టించింది. సోమవారం రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలోని బీసీ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పాము చొరబడింది. అంగన్వాడీ కేంద్రంలోని ఓ చిన్న గుంతలో ఉన్న నాగుపాము.. ఉదయమే వచ్చిన అంగన్వాడీ టీచర్ కంట పడడంతో వెంటనే ఆమె గ్రామంలోని గ్రామస్తులకు తెలిపింది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కర్రలు తీసుకుని వచ్చి గాలింపు చేపట్టారు. ఎక్కడా కనిపించకపోవడంతో గునపంతో ఓ మూలన ధ్వంసం చేయగా.. అందులో నుండి నాగుపాము పడగవిప్పి కనిపించింది. వెంటనే గ్రామస్తులు నాగుపామును చంపేసి బయట పడేశారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికీ అంగన్వాడీ కేంద్రంలోకి చిన్నారులు ఎవరూ కూడా రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని