Urea | రాయపోల్ జులై 23 : యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తే ఫర్టిలైజర్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి నరేష్. ఎస్ఐ మానసలు హెచ్చరించారు. బుధవారం రాయపోల్ మండల పరిధిలోని అనాజీపూర్, రాయపోల్ మండల కేంద్రాల్లో ఫర్టిలైజర్ షాపులను పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి తనిఖీ చేశారు. అదే విధంగా ఫర్టిలైజర్ యజమానులు అందరు తప్పక యూరియా స్టాక్ బోర్డు, ధరల పట్టికలను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతీ రైతుకు బిల్లు కచ్చితంగా ఇవ్వాలి అని.. ఎంఆర్పీ ధరలకు మించి ఎక్కువ అమ్మితే కటిన చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. రైతులకు సరిపోయే విధంగా యూరియా అందుబాటులో ఉందని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. దౌల్తాబాద్ మండలంలో యూరియాను రైతులకు అందించాలని ఫర్టిలైజర్ వ్యాపారులు బ్లాక్ మార్కెట్ విక్రయిస్తే కఠిన చర్యలు తప్పువని దౌల్తాబాద్ మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్. ఎస్ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు.
బుధవారం మండల కేంద్రంలో వారు ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఫర్టిలైజర్ షాప్లో యూరియా స్టాక్ వివరాలను అందుబాటులో ఉంచాలని.. ఎమ్మార్పీ ధరలకు యూరియాను రైతులకు అందించాలని. అధిక ధరలకు విక్రయిస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మండలంలో యూరియా కొరతలేదని.. వ్యాపారులు ఎవరైనా యూరియా నిలువ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు.
Doultabad
Ganja Seized | ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vice president Elections | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఈసీ