MLA kotha Prabhakar Reddy | రాయపోల్, జులై 27 : రాయపోల్ మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గల్వ జీవన్ రెడ్డి తమ్ముడు సత్తిరెడ్డి గత నాలుగు రోజుల క్రితం నర్సింగ్ మండలం వల్లూరు వద్ద లారీ ఢీకొని మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి . రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్ పర్సన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆదివారం రాయపోల్ మండల కేంద్రానికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్న వయసులో వికలాంగుడైన సత్తిరెడ్డి లారీ ఢీకొని మృతి చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు.
కూతురు రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సత్తిరెడ్డి మృతి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిసివేసిందని విచారణ వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. అలాగే మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌరీ గారి పరశురాములు తల్లి ఇటీవల మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా పరుశరాములు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆపదలో ఉన్న కార్యకర్తలను తాను ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెంట దుబ్బాక నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్. మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి. టిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు గల్వ దయాకర్ రెడ్డి, రాష్ట్ర యువజన నాయకుడు ఇప్ప దయాకర్, బీఆర్ఎస్ నాయకులు రంగారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మహమ్మద్ ఇక్బాల్. లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి. యాదవ రెడ్డి రాజు తదితరులు ఉన్నారు.
Nallagonda | నల్లగొండ జిల్లాలో దారుణం.. బిడ్డను బస్టాండ్లో వదిలి వెళ్లిన తల్లి
KTR | ఎరువులు ఇవ్వలేని ముఖ్యమంత్రికి పదవిలో ఉండే అర్హత లేదు.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం
Snake in Temple | ఆలయంలో పాము కలకలం.. భయంతో హడలిపోయిన భక్తులు.. Video