వనపర్తి టౌన్, ఫిబ్రవరి 16 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాత, గులాబీ దళపతి కేసీఆర్ బర్తుడే మంగళవారం ఉండడంతో ముందుగానే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశానుసారం సోమవారం వనపర్తి జిల్లా బీఆర్ఎస్ నేతలు అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మై దానంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హ్యాపీ బర్తుడే కేసీఆర్ అంటూ అక్షర రూపంలో నేతలు ప్రదర్శన చేపట్టారు. కేసీఆర్ జయహో అంటూ నినదించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధ ర్, నాయకులు రమేశ్‌గౌడ్, కృష్ణ, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, నందిమళ్ల అశోక్, గులాం ఖాదర్, జోహెబ్ హుస్సేన్, రాములు, పరంజ్యోతి, జాత్రునాయక్, కుమార్, విజయ్, హేమంత్ పాల్గొన్నారు.