MLA Kotha Prabhakar Reddy | తొగుట: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే పల్లె సీమల్లో వికాసం ఏర్పడిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా తొగుట మండలంలోని వెంకట్రావుపేట, గుడికందుల, పెద్ద మాసాన్ పల్లి ఘనపూర్, గోవర్ధనగిరి గ్రామాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్‌లు పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధి కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్పంచ్‌గా ఏ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ప్రతి ఒక్కరు పార్టీలకతీతంగా గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీ పాలక వర్గం లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయని, పారిశుధ్యం, వీధి లైట్లు, తాగునీటి సమస్యలపై సత్వరం ద్రుష్టి సారించాలని ఆయన కోరారు.కేసీఆర్ హయాంలో కేటాయించిన విధంగా ప్రత్యేక నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సర్పంచులు కే లక్ష్మి, బండారు కవిత స్వామి గౌడ్, రాజిరెడ్డి, పన్యాల ప్రవీణ్ రెడ్డి, ఎన్ సమీరాలతోపాటు ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
Mysaa | అగ్రెసివ్‌గా రష్మిక మందన్నా.. మైసా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది
Bala Krishna | నార్త్ మార్కెట్లో ఆశలు నెరవేరవా.. బాలకృష్ణకి కూడా నిరాశే ఎదురైందా?