MLA Kotha Prabhakar reddy | తొగుట : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో మండలంలోని వెంకట్రావుపేట బండారి రాజగౌడ్ నివాసం నుండి పోచమ్మ దేవాలయం వరకు NREGS లో మంజూరైన రూ: 10 లక్షల సీసీ రోడ్డు పనులను గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సర్పంచ్ జీడిపల్లి అంజమ్మ ప్రతాప్ రెడ్డి హయాంలో గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం జరిగిందని, పదవి ఉన్నా లేకున్నా రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు.
ఈసందర్బంగా మాజీ ఎంపీటీసీ కంకణాల నర్సింలుతో పాటు ఇటీవల గ్రామ మత్స్య శాఖ చైర్మన్గా ఎన్నికైన కత్తుల నరేష్, ముదిరాజ్ సంఘం పెద్దలుగా ఎన్నికైన నాగులపల్లి కనకయ్య, ఎంగలి సత్తయ్యలతోపాటు సీసీ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించిన తమ్మలి యాదయ్య లను సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నాయకులు డబ్బికారి పెంటోజీ, జంగం పెంటయ్య, బండారు స్వామి గౌడ్, పిట్ల వెంకటయ్య, ఓలపు సత్యనారాయణ, సిరిసిల్ల రాజేష్, పులిగారి శివయ్య, కొమురయ్య, సుతారి రాములు, ఈదుగళ్ల పర్శరాములు, బెజ్జనమైన రవి, శివలింగం, ఎంగలి సత్తయ్య, జహంగీర్, పులిగారి లక్ష్మణ్, సందీప్, గణేష్, నర్సింలు, స్వామి, శ్రీకాంత్, భాస్కర్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.
Hyderabad | ఎస్టీ హాస్టల్లో పురుగుల అన్నం.. రోడ్డెక్కిన విద్యార్థులు