Venugopala Swamy Temple | వర్గల్, మే 17 : వర్గల్ మండల కేంద్రంలో వెలసిన అతిపురాతనమైన శ్రీ వేణుగోపాలస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి రతోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు, గీతాజ్ఞానమండలి సభ్యులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు దేవతామూర్తులు పురవీధులలో వాహనసేవలో ఊరేగుతున్నారు.
ఇవాళ యాగశాలలో హోమం, హవనం తదితర క్రతువులు వేదపండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా జరిగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ పునర్నిర్మాణ దాత టేకులపల్లి రాంరెడ్డి వెల్లడించారు.
Read Also :
Inmates Escaped: అమెరికా జైలు నుంచి 10 మంది ఖైదీలు పరారీ
Karimnagar Simha Garjana | కరీంనగర్ సింహ గర్జన.. ఉద్యమ రథసారథి కేసీఆర్ ప్రసంగం ఇదీ..
Tortoise | ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ఈది.. ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తాబేలు