Mallanna Kshetram | చేర్యాల, జూలై 9 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎస్ అన్నపూర్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయ భూముల్లో స్వాగత తోరణం వద్ద 500 మొక్కలు నాటి ఉద్యానవనం ఏర్పాటుకు ఆలయ ఈవో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. స్వామివారి రోజువారి పూజలకు సంబంధించిన పువ్వుల మొక్కలను సైతం ఉద్యానవనంలో పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దివ్య, ఎంపీడీవో శ్రీనివాసవర్మ, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ఱెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఒగ్గు పూజారుల సంఘం అధ్యక్షుడు బొద్దుల కనకయ్య, ఆలయ స్ధానాచార్యుడు పి.మల్లయ్య,హనుమాన్ దేవాలయ పూజారి మధుసూదన్శర్మ,పాలక మండలి సభ్యులు, ఆర్ఐ శ్రీనివాస్, సిబ్బంది, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.
Nizampet | రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి : సోమలింగారెడ్డి
Dangerous Roads | నిత్యం ప్రమాదపు అంచున.. రోడ్ల మరమ్మతుల కోసం ప్రజల ఎదురుచూపు
Garbage | ఎక్కడ చూసినా వ్యర్థాలే.. వ్యవసాయ మార్కెట్ యార్డు కంపుమయం