సిద్దిపేట అర్బన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన సిద్దిపేట పట్టణం ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానో పాధ్యాయుడు రామస్వామిని గురువారం ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా రామస్వామికి ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. రామస్వామికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం అభినందనీయమన్నారు. అదేవిధంగా యస్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రామస్వామిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు మట్టపల్లి రంగారావు, పట్నం భూపాల్ మాట్లాడుతూ విద్యార్థుల సర్వ తోముఖాభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్న రామ స్వామి సేవలు అద్వితీయమన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయు డిగా ఎంపికై సిద్దిపేట జిల్లా ఖ్యాతి పెంచారన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనా రెడ్డి, ప్రతినిధు లు లక్ష్మణ్, బాపురెడ్డి, లకా్ష్మరెడ్డి, మల్లిఖార్డున్ రెడ్డి, ఎస్టీయూ నాయకులు శ్రీధర్, రాజేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు.