MLA Sunitha Lakshma reddy | ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నాకు స్ఫూర్తి.. కాంగ్రెస్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
MLA Sunitha Lakshma Reddy | సాధారణంగా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు వేరే పార్టీ ప్రతినిధులను పొగడడం కష్టతరమే. కానీ నర్సాపూర్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీరాజుయాదవ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని ఒక్కసారి ఆకాశానికి ఎత్తడంతో అక్కడున్న కౌన్సిలర్స్, సిబ్బంది కాసింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
MLA Sunitha Lakshma reddy | నర్సాపూర్, ఫిబ్రవరి 23 : నర్సాపూర్ మున్సిపాలిటీలో సోమవారం నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ల మొదటి సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీరాజుయాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తనకు స్ఫూర్తి అని, ఆదర్శప్రాయమన్నారు.
సాధారణంగా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు వేరే పార్టీ ప్రతినిధులను పొగడడం కష్టతరమే. కానీ నర్సాపూర్‌లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీరాజుయాదవ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని ఒక్కసారి ఆకాశానికి ఎత్తడంతో అక్కడున్న కౌన్సిలర్స్, సిబ్బంది కాసింత ఆశ్చర్యానికి లోనయ్యారు.
మున్సిపల్ చైర్ పర్సన్ ప్రసంగంలో తనకు మద్దతు పలికిన బీజేపీ కౌన్సిలర్లను గానీ, తన పదవికి సహకరించిన కాంగ్రెస్ పెద్దల గురించి గాని సంభాషించకుండా కేవలం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని పొగడడం ఏంటని అక్కడున్న వారందరు అవాక్కయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మనస్థత్వం ప్రజలనే కాకుండా ఇతర పార్టీ ప్రజాప్రతినిధులను సైతం గెలుచేసుకుంటుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం చైర్పర్సన్ లక్ష్మీరాజుయాదవ్ మాట్లాడుతూ.. పార్టీల పరంగా కాకుండా కుటుంబ సభ్యులుగా ఉంటూ నర్సాపూర్ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మహిళ అయినప్పటికి ఎంతో ఉన్నతి సాధించారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీరాజుయాదవ్కు శుభాకాంక్షలు తెలియజేసి నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని భరోసానిచ్చారు.
Read Also :
The Paradise | ‘ది ప్యారడైజ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్.. నాని ఎనర్జీ చూసి షాక్!
Nani | మాస్ మోడ్‌లో నాని.. ‘బ్లడీ రోమియో’లో నేచురల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ?
MSG | ‘మన శంకర వరప్రసాద్ గారు’ సూపర్ సక్సెస్ – రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా సంచలనం!
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

