OTT Movies | ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలో సీక్వెల్ మూవీస్, లవ్ కామెడీ ఎంటర్టైనర్స్, ఎమోషనల్ డ్రామాలు వరుసగా రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. చిన్న సినిమాల నుంచి యంగ్ హీరోల చిత్రాల వరకూ బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి. అటు ఓటీటీలోనూ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ పలు యాక్షన్, థ్రిల్లర్, డ్రామా మూవీస్ స్ట్రీమింగ్కు రానున్నాయి. ఆ విశేషాలు ఇలా…
శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన లవ్ కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించారు. జాతకాల పిచ్చి ఉన్న యువకుడిగా శ్రీవిష్ణు కనిపించనున్నాడు. సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎమోషనల్ డ్రామా ‘ది రైజ్ ఆఫ్ అశోక’
సతీశ్ నీనసాం, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది రైజ్ ఆఫ్ అశోక’ కూడా ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రానుంది. వినోద్ వి దుండలే దర్శకత్వం వహించిన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కినట్లు మేకర్స్ తెలిపారు. వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
కాంట్రవర్సీ సీక్వెల్ ‘ది కేరళ స్టోరీ 2’
వివాదాల నడుమ రిలీజై భారీ చర్చకు దారి తీసిన ది కేరళ స్టోరీ చిత్రానికి సీక్వెల్‌గా ‘ది కేరళ స్టోరీ 2’ ఈ నెల 27న విడుదల కానుంది. కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్లాలా షా నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా కీలక పాత్రల్లో నటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌పై మళ్లీ చర్చ మొదలవడంతో సినిమా రెస్పాన్స్‌పై ఆసక్తి నెలకొంది.
ఫాదర్ సెంటిమెంట్‌తో ‘సన్ ఆఫ్’
సాయి సింహాద్రి హీరోగా నటించిన ఎమోషనల్ డ్రామా ‘సన్ ఆఫ్’ కూడా ఫిబ్రవరి 27న విడుదలకు సిద్ధమైంది. బత్తుల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తండ్రి-కొడుకు అనుబంధాన్ని హైలైట్ చేస్తుందని చిత్రబృందం చెబుతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
ది బ్లఫ్ (హాలీవుడ్ మూవీ – ఫిబ్రవరి 25)
ఇక్కీస్ (హిందీ మూవీ – ఫిబ్రవరి 26)
Bridgerton (వెబ్ సిరీస్ – ఫిబ్రవరి 27)
ది సీఈవో క్లబ్ (ఫిబ్రవరి 23)
ది గ్రే హౌస్ (ఫిబ్రవరి 26)
హనీ (ఫిబ్రవరి 27)
నెట్‌ఫ్లిక్స్ :
అక్యూజ్డ్ (హిందీ మూవీ – ఫిబ్రవరి 27)
చథా పచ్చ
జియో హాట్‌స్టార్ :
ఏ నైట్ ఆఫ్ సెవెన్ కింగ్డమ్స్ ఫైనల్ (ఫిబ్రవరి 23)
ప్యారడైజ్ సీజన్ 2 (ఫిబ్రవరి 23)
వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ (ఫిబ్రవరి 26)
సీక్రెట్ స్టోరీస్ (ఫిబ్రవరి 27)
సంగ్ మర్మర్ (ఫిబ్రవరి 26)
రోస్లిన్ (తెలుగు సిరీస్ – ఫిబ్రవరి 27)
బుగోనియా (ఫిబ్రవరి 28)
జీ5 :
క్రాంతి జ్యోతి విద్యాలయ్ (ఫిబ్రవరి 27)
రాక్షస
కెన్నడీ
డాటర్ ఆఫ్ ప్రసాదరావు (తెలుగు సిరీస్ – ఫిబ్రవరి 27)
అంధా ప్యార్ (రియాలిటీ షో – ఫిబ్రవరి 28)
తడయమ్ (తమిళ సిరీస్ – ఫిబ్రవరి 27)
ఈటీవీ విన్ :
శ్రీ చిదంబరం గారు (తెలుగు మూవీ – ఫిబ్రవరి 26)
మొత్తంగా చూస్తే ఈ వారం థియేటర్లలో లవ్, ఎమోషన్, కాంట్రవర్సీ కలిసిన వినోదం సిద్ధంగా ఉండగా… ఓటీటీలో యాక్షన్, థ్రిల్లర్, డ్రామా కంటెంట్ వరదలా రానుంది. ప్రేక్షకులు తమ అభిరుచికి తగ్గ సినిమా లేదా సిరీస్‌ను ఎంచుకుని ఎంజాయ్ చేయొచ్చు.