TUWJ | జహీరాబాద్, డిసెంబర్ 01 : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) ఆధ్వర్యంలో డిసెంబర్ 3న హైదరాబాద్లో నిర్వహిస్తున్న మహా ధర్నా విజయవంతం చేయాలని TUWJ జహీరాబాద్ అధ్యక్షుడు ఎండీ మిన్హాజ్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇవ్వాల్సిన రెగ్యులర్ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండానే కాలయాపన చేస్తోందని, హెల్త్ కార్డుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పలుమార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ గత 20 నెలలుగా కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక పాత అక్రెడిటేషన్ కార్డులను దపదపాలుగా మాత్రమే రెన్యూవల్ చేస్తూ, కొత్త కార్డుల జారీ విషయాన్ని అధికారులు అనవసర కారణాలు చెబుతూ వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై నిరసనగా డిసెంబర్ 3న ఉదయం 10 గంటలకు మాసబ్ ట్యాంక్, హైదరాబాద్లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహా ధర్నా చేపడుతున్నామని, ఈ ధర్నాకు జహీరాబాద్ నియోజకవర్గంలోని జర్నలిస్టులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Padipuja | అయ్యప్ప స్వామి పడిపూజలో మాజీ ఎమ్మెల్యే
Local Election | విద్యుత్ నో డ్యూ సర్టిఫికెట్ కోసం ఎన్నికల అభ్యర్థుల తిప్పలు
Bomb Threat | కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు