Urea | రాయపోల్, జులై 29 : రైతులకు ఉపయోగపడే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి హెచ్చరించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్
మండల కేంద్రంలోని ఆగ్రోస్ కేంద్రాలు, ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అలాగే అంకిరెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రాజ రాజేశ్వర ట్రేడర్స్, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, శ్రీ యాదాద్రి ట్రేడర్స్, మహిళ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ, అనాజీపూర్లోని షాపులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ షాపులోని యూరియా నిల్వలను, కొనుగోలు పక్రియను, యూరియా స్టాక్ వివరాలను పరిశీలించారు. అదే విధంగా బిల్లు బుక్, స్టాక్ రిజిస్టర్లను , ధరల పట్టికలను పరిశీలించారు. ప్రతి రైతుకు అన్ని వివరాలతో కూడిన బిల్లును ఖచ్చితంగా ఇవ్వాలని ఫర్టిలైజర్ వ్యాపారులకు ఆదేశించారు. అదే విధంగా ఎరువులు, పురుగు మందులను ఎమ్మార్పీ ధరలకు మించి అమ్మినా ఎరువుల, పురుగు మందుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు.
యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్మినా.. అధిక ధరలకు అమ్మినా ఎరువుల చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని డీలర్స్ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారితోపాటు మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేశ్ పాల్గొన్నారు.
Nalgonda : నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
YS Jagan | రెడ్‌బుక్ తరహాలో వైసీపీ యాప్.. వాళ్లందరికీ సినిమా చూపిస్తానని వైఎస్ జగన్ వార్నింగ్
Watch: స్కూటర్‌ను ఢీకొట్టిన వాహనం.. ఆపై రివర్స్‌లో వచ్చి వృద్ధుడ్ని ఢీ