Vanteru Pratap Reddy | గజ్వేల్, మార్చి 27: సీఎంఆర్ఎఫ్ పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 44 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లక్షలాది మందిని ఈ పథకం ద్వారా ఆదుకోవడం జరిగిందన్నారు. ప్రైవేట్ దవాఖానలో చికిత్స కోసం ప్రజలు బయట నుండి అప్పులు చేసి వైద్యాన్ని చేయించుకోవడం జరుగుతుందన్నారు.
గతంలోని కేసీఆర్ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరులో గరిష్ట మొత్తాన్ని ఇచ్చేది అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులో కూడా కోతలను విధించడం, తక్కువగా డబ్బులు మంజూరు చేయడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను పెంచి సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్ పెట్టుకున్న వారికి గరిష్ట మొత్తం మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మండల పార్టీ అధ్యక్షులు బెండ మధు, నూనె కుమార్, నాయకులు గూడెం కృష్ణారెడ్డి, గుంటుక రాజు, చందు తదితరులు ఉన్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!