మిరుదొడ్డి/సిద్దిపేట : బైక్ అదుపు తప్పి గుంతలో పడి గాజులపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మిరుదొడ్డి మండల పరిధి చెప్యాల గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. మిరుదొడ్డి ట్రైనీ ఎస్ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలంని గ్రాజులపల్లి గామానికి చెందిన మారుపాక/దాసరి నర్సింలు (30) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కాగా, సోమవారం రాత్రి గాజులపల్లి నుంచి మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాల గ్రామానికి వచ్చి తిరిగి స్వగ్రామమైన గాజుల పల్లికి అదే రాత్రి తిరిగి ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో చెప్యాల గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి జేసీపీ గుంతలో పడి మృతి చెందాడు.
మృతుడి భార్య కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ట్రైనీ ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని దుబ్బాక ఏరియా దవాఖానకు తరలించారు.