10th exams | రాయపోల్, అక్టోబర్ 8: పదోతరగతి పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండలంలోని బేగంపేట పాఠశాల సముదాయంలో ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రతి తరగతిలో విద్యార్థుల చదవడం, రాయడం, మధ్యాహ్న భోజన పథకం అమలు, ప్రతి సబ్జెక్టులో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కొంతమంది విద్యార్థులకు డిక్టేషన్ నిర్వహించి వారి ప్రావీణ్యతను అంచనా వేశారు. ప్రతి విద్యార్థి చదవడం,రాయడం వచ్చేటట్లు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన సూచించారు.
అలాగే మధ్యాహ్న భోజనం మెనూను నిర్ణీత ప్రణాళిక ప్రకారం పాటించాలని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థులు ఈసారి కనీసం 90 శాతం ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు ఇప్పటినుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుని తరగతి వారీగా స్లిప్ టెస్టులు నిర్వహించాలని, పరీక్షలపై ఉన్న భయం తొలగించే విధంగా మార్గదర్శనం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డీ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, సీఆర్పీలు యాదగిరి,స్వామి, ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్