Students Skills | రాయపోల్, ఆగస్టు 25 : రాయపోల్ మండల కేంద్రంలో FLN-TLM మేళా జెడ్పీహెచ్ఎస్ రాయపోల్‌లో రాయపోల్ మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మేళాను మండల విద్యాధికారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు వారు తయారుచేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌తో విద్యార్థులకు తరగతి గదిలో ఏవిధంగా ఉపయోగించి పాఠ్యాంశాలు బోధిస్తున్నారనే అంశాలను అందరూ ఉపాధ్యాయులు చర్చించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వర్గల్ మండలం నుండి రాజ నరేందర్ రెడ్డి, ప్రశాంత్, జైపాల్ రెడ్డి వ్యవహరించారు.
ముఖ్యఅతిథిగా సెక్టోరల్ ఆఫీసర్ ఎం రమేష్ సార్ హాజరయ్యారు. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ పిల్లల అభ్యసన అభివృద్ధికి ఎంతగానో దోహద పడుతుంది. అందరూ ఉపాధ్యాయులు కూడా టీఎల్ఎం ఉపయోగించి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించాలని సూచించారు. టీఎల్ఎం అనేది తక్కువ ఖర్చుతో తయారు చేయబడి అందరు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌లో ఉత్తమంగా ఉన్న పది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది.
జిల్లా స్థాయిలో జరిగే టీఎల్ఎం మేళాలో ఈ 10 టీఎల్ఎంలు రాయపోల్ మండలం నుండి పాల్గొంటారని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి సార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిహెచ్ఎస్ రాయపోల్ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటేశ్వర్లు, జడ్పీహెచ్ఎస్ బేగంపేట గజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల, జెడ్పిహెచ్ఎస్ వడ్డేపల్లి గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్, సీఆర్పీలు పాల్గొన్నారు.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు