SI Arunkumar | రాయపోల్ 22 : విద్యతోనే సమాజంలో విద్యార్థులకు మంచి గుర్తింపు వస్తుందని చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి చదువులో రాణించాలని అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాత వంగ మహేందర్ రెడ్డి సహకారంతో పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై, సైబర్ మోసాల గురించి తగిన సూచనలు చేశారు. మోటార్ సైకిల్ వినియోగించినప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు గుర్తు చేయాలన్నారు. 18 సంవత్సరాల లోపు విద్యార్థులు మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేయకూడదని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచనలు చేశారు.
ప్రధానోపాధ్యాయులు బాసిత్ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రాజేశ్వర్, మధుర కవి, శ్రీధర్, యాదగిరి కిషన్ రెడ్డి, రాజు, రమేష్, సాగరిక, చందు, కల్యాణి పాల్గొన్నారు.
Kanwar Yatra: కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లు లైసెన్సులు డిస్ప్లే చేయాలి: సుప్రీంకోర్టు
TTD key decisions | టీటీడీ కీలక నిర్ణయాలు.. సైబర్ క్రైమ్ లాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Crime news | అత్యాచారం చేశాడంటూ డెలివరీ బాయ్‌పై మహిళా టెక్కీ తప్పుడు ఫిర్యాదు.. తర్వాత ఏమైందంటే..!