Garbage | రాయపోల్, జులై 22 : పరిసరాల పరిశుభ్రతపై అధికారులు దృష్టి పెట్టకపోవడంతో సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డు ఇరువైపులా పారిశుధ్యం లోపించడంతో దుర్వాసన వెదజల్లుతుంది. నిత్యం అటువైపు ప్రయాణించే వాహనదారులు ముక్కున వేలేసుకొని పోతున్నారు. దౌల్తాబాద్ బైపాస్ రోడ్డుకిరువైపులా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా ఇరువైపులా మొక్కలు నాటి ఏపుగా పెంచారు. అయితే ప్రత్యేక అధికారుల పాలనలో బైపాస్ రోడ్డు ఇరువైపులా చిత్తాచెదారం వేయడంతో అటువైపు పోవాలంటే దుర్వాసన వస్తుండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
బైపాస్ రోడ్డు పచ్చని చెట్ల మధ్య ఉన్నప్పటికీ ఇరువైపులా పారిశుధ్యం లోపించి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. బైపాస్ రోడ్డు ప్రక్కన ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించి ఇబ్బందులు లేకుండా చూడాలని పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఇంతవరకు ప్రయోజనం చేకూరలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఒకవైపు జిల్లా అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నప్పటికీ. గ్రామ మండల స్థాయిలో అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డుతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం నిండిపోవడంతో అక్కడ కూడా పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. దీంతో మండల కేంద్ర ప్రజలు, పలు గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దౌల్తాబాద్ మండల కేంద్రంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టే విధంగా మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు పేర్కొంటున్నారు.
Kanwar Yatra: కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లు లైసెన్సులు డిస్ప్లే చేయాలి: సుప్రీంకోర్టు
TTD key decisions | టీటీడీ కీలక నిర్ణయాలు.. సైబర్ క్రైమ్ లాబ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Crime news | అత్యాచారం చేశాడంటూ డెలివరీ బాయ్‌పై మహిళా టెక్కీ తప్పుడు ఫిర్యాదు.. తర్వాత ఏమైందంటే..!