హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పదే పదే నోరుపారేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంస్కారహీనతకు నిదర్శనమ ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. సీఎం కుర్చీలో కూ ర్చొని రౌడీభాష మాట్లాడటం అభ్యంతరకరమని పేర్కొన్నారు.
పరిణతి చెందిన ప్రజాస్వామిక స్ఫూర్తితో జరుగాల్సిన విమర్శను రోత భాషతో రాజకీయాలను సీఎం కలుషితం చేస్తున్నారని, తెలంగాణ గడ్డ ఎప్పటి కీ క్షమించదని మండిపడ్డారు. రేవంత్ ఇలాగే వ్యవహరిస్తే, త్వరలో సంఘ బహిష్కరణ శిక్ష తప్పదని హెచ్చరించారు. 72 ఏండ్ల వయసున్న తండ్రిలాంటి, రాజ్యాంగ హోదా కలిగిన ప్రతిపక్ష నేతకు, సాటి మనిషికిచ్చే కనీస మర్యాద కూడా ఇవ్వకపోవ డం చట్టపరంగా నేరమని పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి రూ.కోట్ల ప్రజల సొ మ్ము ఖర్చు పెట్టి, హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి నేర్చుకున్నది ఇలాంటి భాషేనా? అని శ్రవణ్ ప్రశ్నించారు. ఉద్యమనేత, రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను ఒక కులానికి పరిమి తం చేయాలని చూడటం తెలంగా ణ అస్తిత్వానికి చే స్తున్న విద్రోహంగా అభివర్ణించారు. కేవలం ఓట్ల కోసం కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి తీరు క్షమించరానిదని, తన కుల అహంకారానికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజల చేత మహానాయకుడిగా కొనియాడబడుతున్న కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా గుర్తించకపోతే అది ఆయన మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు.
సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు ఉన్న జ్ఞానం సీఎం రేవంత్‌రెడ్డికి ఉంటే బాగుండేదని శ్రవణ్‌కుమార్ ఎద్దేవా చేశా రు. ‘మాట్లాడేటప్పుడు నోరు, ఆలోచించేటప్పుడు మనసు అదుపులో ఉండాలి. ఎ వరినైనా కలువాల్సి వచ్చినప్పుడు ప్రవర్తన ఉండాలి. భవిష్యత్ గురించి ఆలోచించేటప్పుడు మెదడు సక్రమంగా ఉండాలి. నిర్భయంగా ముందడుగు వేయాలి అని తెలిసి మసలుకోండి సన్నిహితులారా’ అంటూ ఎక్స్ వేదికగా పరుచూరి చేసిన వ్యాఖ్యలను దాసోజు అభినందించారు. ఈ కాస్త జ్ఞా నం, విజ్ఞత సీఎం రేవంత్‌రెడ్డికి ఉంటే, రాష్ట్ర రాజకీయాలు కలుషితం కాకుండా ఉండేవేమోనని ఆయన ట్వీట్ చేశారు.