హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి దేశంలోనే అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సీఎంగా గుర్తింపు పొందారని, ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో పట్టుబడి 50 రోజులు జైలు శిక్ష అనుభవించారని, అలాంటి వ్యక్తికి ఇచ్చిన సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీకి విజ్ఞప్తిచేశారు.
ఈ మేరకు గురువా రం వర్సిటీ చైర్మన్ అలాన్ గార్బర్, డీన్ వైన్‌స్టీన్‌కు ఒక లేఖను ఈ-మెయిల్ చేశారు. ముఖ్యమంత్రిగా కుంభకోణాలకు పాల్పడుతూ, ప్రతిచోట ప్రత్యర్థులపై అభ్యంతరకర భాషను ప్రయోగిస్తున్న వ్యక్తికి ‘21 వ శతాబ్దంలో నాయకత్వం.. గందరగోళం, సంఘర్షణ, ధైర్యం’ అనే యూ నివర్సిటీ కార్యనిర్వాహక కార్యక్రమంలో సర్టిఫికెట్ ప్రదానం చేయడం పై ఒక పూర్వ వి ద్యార్థిగా తీవ్ర నిరాశ, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నానని పేర్కొన్నారు.
యూనివర్సిటీ నిర్ణ యం సంస్థాగత నిర్లక్ష్యానికి నిదర్శనమని తప్పుబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి కుల, మత ప్రా తిపాదికన విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. 400 ఏండ్లుగా వివిధ రంగాల్లో ప్రపంచస్థాయిలో నైతిక విలువలు కలిగిన నాయకులను తీర్చిదిద్దుతున్న విశ్వవిద్యాలయం ఇలాంటి నీతిబాహ్యమైన నాయకుడికి సర్టిఫికెట్ ఇవ్వడం అభ్యంతరకరమని తెలిపారు. రేవంత్‌రెడ్డికి ఇచ్చిన సర్టిఫికెట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ సత్వర స్పందన కోసం ఎదురుచూస్తున్నానని ముగించారు.