గజ్వేల్, ఫిబ్రవరి17: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాహబ్‌ను గజ్వేల్‌లో నిర్మించనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్ 68వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ క్రీడాపోటీలు గురువారం ముగిశాయి. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో యువజన, క్రీడల శాఖ సమన్వయంతో ఈ పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. ఫుట్‌బాల్ ఫైనల్స్‌లో సదాశివపేట విజేతగా, రెండోస్థానంలో మెదక్ జట్టు నిలిచింది. ముగింపు కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఐఎస్ఎల్ స్పాన్సర్ చేసిన షూ, జెర్సీలను మంత్రి, ఎఫ్డీసీ చైర్మన్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జిపి.ఫల్గుణ, ఐఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ సుశిత్ క్రీడాకారులకు అందజేశారు. కరాటే, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. గజ్వేల్ పేరు అంతర్జాతీయ స్థాయి లో నిలిచిపోయేలా క్రీడా హబ్‌ను నిర్మిస్తామన్నారు.
ఎఫ్డీసీ చైర్మన్ ఆధ్వర్యంలో..
నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో, గ్రామగ్రామాన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నల్లవాగు హనుమాన్ దేవాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, నాయకు లు మాదాసు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, కార్యదర్శి రమేశ్‌గౌడ్, పార్టీ పట్టణాధ్యక్షుడు నవా జ్ పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వైస్ చైర్మన్ జకియోద్దీన్, వైస్ ఎంపీపీ కృష్ణ, కౌన్సిలర్లు రహీం, అత్తెల్లి శ్రీనివాస్, మర్కంటి కనకయ్య పాల్గొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్‌సి రాజమౌళి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, ఎంఎస్ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి సుధాకర్‌రెడ్డి, యువజన క్రీడాశాఖ జిల్లా అధికారి నాగేందర్ పాల్గొన్నారు.
రన్ ఫర్ సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రముఖ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో 68 కి.మీల అల్ట్రా రన్‌ను చేపట్టారు. గురువారం ఈ రన్‌ను చింతమడక గ్రామంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్డ్డి, సర్పంచ్ హంసకేతన్‌రెడ్డి, ఎంపీపీ శ్రీదేవి చందర్రావు, జడ్పీటీసీ శ్రీహరిగౌడ్, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి ప్రారంభించారు. చింతమడక నుంచి ఈ రన్ సిద్దిపేట పట్టణానికి చేరుకోగా, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పాల్గొని అథ్లెట్లకు స్వాగతం పలికారు. సిద్దిపేట మీదుగా గజ్వేల్ వరకు కొనసాగింది. ఈ రన్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిర్వాహకులకు ఆయన అభినందించారు. చింతమడక గ్రామంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు వెంకట్‌రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ క్రీడాకారులు పాల్గొన్నారు.