మిరుదొడ్డి, మే 12 : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ పథకం కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యద్యర్శి పెద్దలింగన్నగారి శంకర్ అన్నారు. సోమవారం మిరుదొడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్బర్పేట-భూంపల్లి మండలంలోని పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన దళిత ఉపాధిహామీ కూలీలైన గోప దేవమ్మ, బ్యాగరి చంద్రయ్యల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కూలీలకు బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. మృతి చెందిన కూలీల అంత్యక్రియలకు రూ.50 వేలు చొప్పున మృతుల కుటంబాలకు జిల్లా కలెక్టర్ విడుదల చేయాలన్నారు.