Komuravelli | చేర్యాల, జూలై 18 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఎస్బీఐ కొమురవెల్లి శాఖ అధికారులు రూ.1లక్ష50వేల విలువైన లాకర్లను శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆలయఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ.. భక్తుల వసతుల కోసం చేపడుతున్న కార్యక్రమాలకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా 100 కాటేజీల నిర్మాణాలకు దాతలు విరాళాలు అందిస్తున్నారని, మరింత మంది దాతలు ముందుకు రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ జి.భువనేశ్వరి, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, సిద్దిపేట రీజినల్ మేనేజర్ కె.మారుతి, జోనల్ అధికారి క్రాంతి కుమార్, కొమురవెల్లి బ్రాంచి మేనేజర్ అర్జున్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.